తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ నిధుల రాకతో లాభాల్లో సూచీలు - స్టాక్​ మార్కెట్ల తాజా న్యూస్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, విదేశీ నిధుల రాకతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 120 పాయింట్ల లాభంతో 38,246 పాయింట్ల వద్ద సెన్సెక్స్​, 34 పాయింట్ల వృద్ధితో 11,340 వద్ద నిఫ్టీ కొనసాగుతున్నాయి.

విదేశీ నిధుల రాకతో- లాభాల్లో సూచీలు

By

Published : Oct 14, 2019, 10:17 AM IST

అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, విదేశీ నిధుల రాకతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలో ఒడుదొడుకులకు లోనైనప్పటికీ లోహ, ఆటో, బ్యాంకింగ్​ రంగ షేర్ల దూకుడుతో లాభాల్లోకి వచ్చాయి.

బాంబే స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ 120 పాయింట్ల లాభంతో 38, 246 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 11,340 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి...

టాటా మోటర్స్​, టాటా స్టీల్​, వేదాంత, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, సన్​ ఫార్మా, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​యూఎల్​, ఎస్​బీఐ షేర్లు సుమారు 4 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇన్ఫోసిస్​, యూపీఎల్​, సిప్లా, పవర్​ గ్రిడ్​, జీ ఎంటర్​టైన్​మెంట్, కొటక్​ మహీంద్రా బ్యాంక్​, టీసీఎస్​, టెక్​ మహీంద్ర సుమారు 3 శాతం మేర నష్టపోయాయి.

రూపాయి...

రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 19 పైసలు లాభపడి రూ.70.83 వద్ద అమ్ముడవుతోంది.

ABOUT THE AUTHOR

...view details