తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆకాశమే హద్దుగా మార్కెట్లు.. జీవనకాల గరిష్ఠానికి సూచీలు - దేశీయ మార్కెట్లు

విదేశీ నిధుల ప్రవాహం, హెవీ వెయిట్​ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు సరికొత్త శిఖరాలను తాకాయి. ఆరంభ ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 41,810 పాయింట్లు, నిఫ్టీ 12,285 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ప్రస్తుతం 75 పాయింట్ల వృద్ధితో సెన్సెక్స్​ 41,749 వద్ద ట్రేడవుతోంది.

Sensex
జీవనకాల గరిష్ఠానికి సూచీలు

By

Published : Dec 20, 2019, 10:10 AM IST

వరుస లాభాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న దేశీయ స్టాక్​ మార్కెట్లు ఇవాళా దూసుకెళ్తున్నాయి. సెషన్​ ప్రారంభంలో జీవనకాల గరిష్ఠాలను తాకాయి. విదేశీ నిధుల రాక, ఆర్​ఐఎల్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ వంటి హెవీ వెయిట్​ షేర్ల దూకుడుతో తారా జువ్వలా దూసుకెళ్లాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ ఇవాళ ఆరంభ ట్రేడింగ్​లో మరోమారు రికార్డు స్థాయి 41,810 పాయింట్ల జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 75 పాయింట్ల లాభంతో 41,749 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ ప్రారంభంలో 12,285 పాయింట్ల జీవనకాల గరిష్ఠాన్ని చేరింది. ప్రస్తుతం 21 పాయింట్ల వృద్ధితో 12,281 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివి..

ఎస్​ బ్యాంక్​ సుమారు 2.91 శాతం మేర లాభపడింది. ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హీరోమోటోకార్ప్​​, టాటా మోటర్స్​, టీసీఎస్​, ఎల్​ అండ్ ​టీ, బజాజ్​ ఫినాన్స్​లు రాణించాయి.

వేదాంత షేర్లు భారీగా నష్టపోయాయి. 0.97 మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. కోటక్​ బ్యాంకు, టాటాస్టీల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెచ్​యూఎల్ ఆరంభ ట్రేడింగ్​లో​ డీలా పడ్డాయి.

రూపాయి..

రూపాయి స్వల్పంగా 12 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే ప్రస్తుతం మారకం విలువ రూ. 71.15 వద్ద ఉంది.

ఇదీ చూడండి: ఓ 'బేబీ' ఎంత పని చేశావే.. అమెరికాలో సాఫ్ట్​వేర్ నిపుణుడి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details