స్టాక్ మార్కెట్లలో బుల్ దూకుడు మూడో రోజూ కొనసాగింది. కరోనా భయాలున్నా.. రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలను దిగువకు సవరిస్తున్నా.. సూచీలు వరుసగా లాభాలను నమోదు చేస్తున్నాయి.
బుధవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 790 పాయింట్లు పెరిగి 48,734 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 14,864 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,801 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,066 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,890 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,694 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.