దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి రికార్డులు సృష్టించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 403 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 55,959వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 128 పాయింట్ల లాభంతో తొలిసారి 16,625 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ సానుకూలతలు, లోహ, ఆర్థిక షేర్ల అండ లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మార్కెట్లు లాభాలతో ముగియటం వరుసగా ఇది రెండో సెషన్.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 56,023 పాయింట్ల అత్యధిక స్థాయి, 55,536 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,647 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,495 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.