తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు భారీ లాభాలు- 54,800 పైకి సెన్సెక్స్​

గురువారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. సెన్సెక్స్ 318 పాయింట్ల లాభంతో 54,844 వద్దకు చేరింది. నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 16,300 పైన స్థిరపడింది. ఇండస్​ ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు భారీ లాభాలను గడించాయి.

today stock market closing
స్టాక్​ మార్కెట్​ క్లోజింగ్​ అప్​డేట్స్​

By

Published : Aug 12, 2021, 3:41 PM IST

స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ పాయింట్ల లాభంతో 54,844 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 16,364 వద్దకు చేరింది.

ఐటీ, బ్యాంకింగ్, పవర్ గ్రిడ్​ వంటి షేర్ల సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 54,862 పాయింట్ల అత్యధిక స్థాయి, 54,536 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 16,375 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,286 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

పవర్ గ్రిడ్, టెక్ మహీంద్ర, టాటా మోటార్స్, హెచ్​సీఎల్​ టెక్​, ఎల్​&టీ లాభాలను గడించాయి.

ఐచర్​మోటార్​, డాక్టర్​ రెడ్డీస్​, సిప్లా​, ఐఓసీ, ఓఎన్​జీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:దేశంలో పెరుగుతున్న విమానయాన ప్రయాణికులు

ఇదీ చూడండి:భారీగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details