తెలంగాణ

telangana

ETV Bharat / business

సెన్సెక్స్ ఇంట్రాడే​ రికార్డ్.. 12 వేల చేరువలో నిఫ్టీ - స్టాక్ మార్కెట్ల సమాచారం

దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్​ 250 పాయింట్లు పుంజుకుంది.  40,435 పాయింట్ల ఇంట్రాడే రికార్డు నమోదు చేసింది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 12 వేల మార్కుకు చేరువలో ఉంది.

BIZ-STOCKS-OPEN

By

Published : Nov 4, 2019, 10:20 AM IST

Updated : Nov 4, 2019, 10:48 AM IST

వారాంతంలో ఒడుదొడుకులకు లోనయిన స్టాక్​ మార్కెట్లు.. సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు లాభపడి 40,415 పాయింట్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ఒకానొక దశలో 269 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్​.. 40,435 పాయింట్ల ఇంట్రాడే రికార్డును తాకింది.

నిఫ్టీ 81 పాయింట్లు మెరుగై 11,972 వద్ద కొనసాగుతోంది.

విదేశీ సంస్థల పెట్టుబడులు, మ్యూచువల్​​ ఫండ్స్​తో ద్రవ్యలభ్యత పెరగటం మార్కెట్లకు కలిసి వచ్చింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి సంస్కరణల వైపు ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

లాభ నష్టాల్లో...

టాటా స్టీల్​ అత్యధికంగా 7 శాతం లాభపడింది. వేదాంత, బజాజ్​ ఫైనాన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్​టెల్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎస్​ బ్యాంక్, ఇన్ఫోసిస్, హీరోమోటోకార్ప్, బజాజ్​ ఆటో, పవర్​ గ్రిడ్​ నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి 26 పైసలు బలపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.55 వద్ద కొనసాగుతోంది.

జపాన్​ మినహా ఆసియా మార్కెట్లన్నీ లాభాల బాటపట్టాయి.

Last Updated : Nov 4, 2019, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details