వారాంతపు సెషన్‌ను సూచీలు లాభాలతో ముగించాయి. టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఎచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గుచూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. గత సెషన్‌లో 5 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్... శుక్రవారం 176 పాయింట్ల వృద్ధితో తొలిసారి 56వేల బెంచ్‌మార్క్ ఎగువన ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ-నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 16వేల 705 పాయింట్ల సరికొత్త గరిష్ఠస్థాయి వద్ద స్థిరపడింది. మెటల్, ఫార్మా షేర్లు జోరు కొనసాగించాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 56,188 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 55,676 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.