వరుసగా లాభాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ప్రారంభమయ్యాయి. 220 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 40,910 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 57 పాయింట్లు కోల్పోయి 12,093కు చేరుకుంది.
మాంద్యం భయాలతో..
రెండో త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాల విడుదల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. రెండో త్రైమాసికంలో జీడీపీ రేటు 4.2 నుంచి 4.7 శాతం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది మొదటి త్రైమాసికం కన్నా తక్కువ.
లాభనష్టాల్లో..
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నా.. 4 శాతం వృద్ధితో ఎస్ బ్యాంక్ లాభాల్లో ఉంది. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టెక్ మహింద్రా, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డాయి.