తెలంగాణ

telangana

ETV Bharat / business

వాణిజ్య యుద్ధ భయాలతో నష్టాల్లో మార్కెట్లు - ప్రతికూలతల మధ్య నష్టాల్లో

నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 232 పాయింట్లు నష్టపోయి 38,072 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 11,304 వద్ద ట్రేడవుతున్నాయి.

వాణిజ్యయుద్ధ భయాలతో నష్టాల్లో మార్కెట్లు

By

Published : Oct 3, 2019, 10:49 AM IST

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వాణిజ్యయుద్ధ భయాలు మళ్లీ కమ్ముకోవడమూ నష్టాలకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్ఛ్సేంజి సూచీ- సెన్సెక్స్​ 232 పాయింట్ల నష్టంతో 38,072 వద్ద కొనసాగుతోంది . జాతీయ స్టాక్​ ఎక్ఛ్సేంజి సూచీ-నిఫ్టీ 55 పాయింట్లు కోల్పోయి 11,304 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో...

ఎస్​ బ్యాంక్​, టాటా మోటార్స్​, హీరో మోటోకార్ప్​, ఐటీసీ బజాజ్​ ఆటో, ఎస్​బీఐ, ఐసీసీ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లో...

వేదాంత, యాక్సిస్​ బ్యాంక్​, టాటాస్టీల్, భారతి ఎయిర్​టెల్​, సన్​ఫార్మా, ఎల్​ అండ్​ టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు కూడా నష్టపోయాయి. యూరప్‌ వస్తువులపై 7.5 లియన్‌ డాలర్ల పన్నులు విధించడం వల్ల ఈ రకంగా మార్కెట్లు స్పందించాయి.

రూపాయి...

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 28 పైసలు బలహీన పడి రూ.71.35 వద్ద కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details