తెలంగాణ

telangana

ETV Bharat / business

కుప్పకూలిన మార్కెట్లు- సెన్సెక్స్ 1,066 పాయింట్లు డౌన్ - స్టాక్ మార్కెట్ వార్తలు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,066, నిఫ్టీ 291 పాయింట్లు పతనమయ్యాయి.

stocks
కుప్పకూలిన మార్కెట్లు

By

Published : Oct 15, 2020, 3:41 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్1,066 పాయింట్లు పతనమై 39,728 పాయింట్లకు పడిపోయింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 291 పాయింట్లు క్షీణించి 11,680 పాయింట్లకు చేరింది.

గత పది రోజుల వచ్చిన లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడం వల్ల మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.

లాభనష్టాల్లో...

ఏషియన్​ పెయింట్స్ మినహా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బజాజ్​ ఫినాన్స్, టెక్​ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు 4 శాతానికిపైగా పడిపోయాయి.

రూపాయి మారకం..

అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి డాలరుతో పోలిస్తే 73.36 వద్ద స్థిరపడింది.

చమురు..

బ్రెంట్ క్రూడ్ ధర 1.27 శాతం పడిపోయి బ్యారెల్​కు 42.77 డాలర్లకు చేరింది.

ABOUT THE AUTHOR

...view details