తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు - STOCKS-CLOSE latest news

దేశీయ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​ 83 పాయింట్ల వృద్ధితో 34,370 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 10 వేల ఎగువకు చేరుకుంది.

stocks
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు

By

Published : Jun 8, 2020, 3:49 PM IST

Updated : Jun 8, 2020, 4:25 PM IST

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ నిధుల ప్రవాహంతో ఇవాళ ఆరంభ ట్రేడింగ్​లో భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. మదుపరులు లాభాలు స్వీకరించేందుకు మొగ్గుచూపటమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ ఆరంభ ట్రేడింగ్​లో 640 పాయింట్ల మేర దూసుకెళ్లింది. చివరకు​ 83.34 పాయింట్లు లాభంతో 34,370 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 25 పాయింట్ల వృద్ధితో 10వేల 176 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి..

ఇండస్​ఇండ్​ బ్యాంక్​ సుమారు 7 శాతం మేర లాభాలు అర్జించింది. ఆ తర్వాత యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​, ఓఎన్​జీసీ, టైటాన్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్రా లాభాల్లో ముగిశాయి. జియోలో అబుదాబి సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టిన క్రమంలో రిలయన్స్​ షేర్లు 3 శాతం పెరిగి ఏడాది గరిష్ఠాన్ని తాకాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, నెస్లే​ ఇండియా, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎం అండ్ ఎం, జీ ఎంటర్​టైన్​మెంట్​, శ్రీ సిమెంట్​, ఐషర్​ మోటర్స్​, ఎం అండ్ ​ఎం, భారతీ ఎయిర్​టెల్ నష్టాలు మూటగట్టుకున్నాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 3 పైసలు లాభపడి రూ. 75.55 వద్దకు చేరింది.

Last Updated : Jun 8, 2020, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details