తెలంగాణ

telangana

ETV Bharat / business

వృద్ధి మందగమనం అంచనాలతో మార్కెట్లు డీలా - దేశీయ స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాలు

వృద్ధిరేటు మందగిస్తుందన్న అంచనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 71 పాయింట్లు కోల్పోయి 40,939 వద్ద ముగియగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 12,061 వద్ద స్థిరపడింది. అంతకుముందు సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠం 41,185ను తాకింది.

stocks
వృద్ధి మందగమనం అంచనాలతో మార్కెట్లు విలవిల

By

Published : Dec 16, 2019, 4:20 PM IST

Updated : Dec 16, 2019, 5:28 PM IST

అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూల పవనాలతో రికార్డు స్థాయిలో ట్రేడ్​ అయిన స్టాక్ మార్కెట్లు.. వృద్ధిరేటు తగ్గుతుందన్న మూడీస్ అంచనాల వల్ల నష్టాలతో ముగిశాయి. ఇంధనం, ఎఫ్​ఎంసీజీ, ఆటో షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 71 పాయింట్లు కోల్పోయి 40,939 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 26 పాయింట్ల క్షీణతతో 12,061 వద్ద స్థిరపడింది.

లాభాలు..

ట్రైడెంట్, రిలయన్స్ ఇన్​ఫ్రా, టీసీఎస్, హెచ్​సీఎల్ టెక్నాలజీస్, హెచ్​డీఎఫ్​సీ, కొటక్ బ్యాంక్, గెయిల్, ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

నష్టాలు..

గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, జేఎస్​డబ్ల్యూ స్టీల్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఇన్​ఫ్రాటెల్, టైటాన్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాలతో ముగిశాయి.

రూపాయి క్షీణత

డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 18 పైసలు క్షీణించి రూ. 71.01కి చేరింది. అంతర్జాతీయ విపణిలో బ్యారల్ ముడిచమురు ధర 65.23కు చేరింది.

ఇతర మార్కెట్లు ఇలా

షాంఘై, హాంగ్​కాంగ్, సియోల్, టోక్యో, ఐరోపా స్టాక్ మార్కెట్ సూచీలు ఒడుదొడుకుల్లో ముగిశాయి.

ఇదీ చూడండి: 'వృద్ధి రేటును మరోసారి కుదించిన మూడీస్​'

Last Updated : Dec 16, 2019, 5:28 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details