వరుస లాభాలతో రికార్డులు తిరగరాస్తూ ముందుకు సాగిన స్టాక్ మార్కెట్ల (Stock Markets today) జోరుకు.. మంగళవారం అడ్డుకట్ట పడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 410 పాయింట్లు కోల్పోయి 59,667 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 106 పాయింట్ల నష్టంతో 17,748 వద్దకు చేరింది.
మార్కెట్ల రికార్డు లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. రికార్డు స్థాయి వద్ద ఇలాంటి నష్టాలు సాధారణమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
టెలికాం, ఐటీ, బ్యాంకింగ్ షేర్లు భారీగా కుదేలయ్యాయి. మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నా.. విద్యుత్ షేర్లు భారీగా పంజుకున్నాయి. ఫార్మా షేర్లు రాణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Share price) షేర్లు మళ్లీ జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 60,288 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,045 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,912 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,576 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.