స్టాక్ మార్కెట్లు (Stock Market) వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 361 పాయింట్లు కోల్పోయి 58,765 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 86 పాయింట్ల నష్టంతో 17,532 వద్దకు చేరింది. మార్కెట్లు నష్టాలతో ముగియటం వరుసగా ఇది నాలుగో సెషన్(Stock Market Today).
అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక, ఐటీ, టెలికాం షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్(Stock Market) 58,890 పాయింట్ల అత్యధిక స్థాయి, 58,551 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,557 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,452 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.