తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూలతలతో చివరకు లాభాలు - అంతర్జాతీయ సానుకూలతలతో లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న సానూకూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 227 పాయింట్లు వృద్ధి చెంది 41 వేల 613 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 12 వేల 248 వద్ద స్థిరపడింది.

stocks
అంతర్జాతీయ సానుకూలతలతో లాభాల్లో మార్కెట్లు

By

Published : Jan 24, 2020, 4:23 PM IST

Updated : Feb 18, 2020, 6:12 AM IST

కరోనా వైరస్​ వల్ల చైనా మినహా మిగతా దేశాలకు ఎలాంటి ప్రమాదం లేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో.. స్టాక్​ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పవనాల ప్రభావంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 227 పాయింట్లు వృద్ధి చెంది 41, 613 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 12, 248 వద్ద స్థిరపడింది.

లాభాల్లో ఉన్న షేర్లు

అల్ట్రా టెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు

పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, మారుతి, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు డీలాపడ్డాయి.

రూపాయి క్షీణత

డాలరు మారకం ధరతో పోలిస్తే రూపాయి విలువ 6 పైసలు తగ్గి 71. 32 వద్ద ముగిసింది.

ముడి చమురు

బ్రెంట్ ముడి చమురు ధర 0.15 శాతం పెరిగి 62.13 డాలర్లుగా ఉంది.

ఆసియా మార్కెట్లు

హాంగ్​కాంగ్, జపాన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చైనా, తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లకు నేడు సెలవు కారణంగా మార్కెట్ లావాదేవీలు జరగలేదు.

ఇదీ చూడండి: టాటాసన్స్- మిస్త్రీ కేసు: ఎన్​సీఎల్​ఏటీ తీర్పుపై సుప్రీం స్టే

Last Updated : Feb 18, 2020, 6:12 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details