దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 250 పాయింట్లు నష్టపోయి 41,372 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ కూడా 76 పాయింట్లు కోల్పోయి 12,171కు చేరుకుంది.
కరోనా వైరస్..
చైనాలో కరోనా వైరస్ విజృంభనతో విదేశీ మదుపరుల్లో భయాందోళనలు నెలకొన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడబోయే ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి భారీ సంస్థలు నష్టపోవటం వల్ల స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి.