అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో స్టాక్ మార్కెట్లు (Stock Markets today) బుధవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 207 పాయింట్లు కోల్పోయి 61,143 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 57 పాయింట్ల నష్టంతో 18,211 వద్దకు చేరింది. ఫార్మా షేర్లు రాణించగా.. లోహ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 61,577 పాయింట్ల అత్యధిక స్థాయి, 61,989 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 18,342 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 18,168 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.