తెలంగాణ

telangana

ETV Bharat / business

వెంటాడిన కరోనా భయాలు.. సెన్సెక్స్​, నిఫ్టీ భారీ పతనం - స్టాక్​మార్కెట్లు

STOCKS LIVE
నష్టాల్లో స్టాక్​మార్కెట్లు.. 10 వేల దిగువకు నిఫ్టీ

By

Published : Jun 15, 2020, 9:42 AM IST

Updated : Jun 15, 2020, 4:02 PM IST

15:51 June 15

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు...

అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో.. వారం ఆరంభ సెషన్​లోనే స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 552 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి.. 9 వేల 813 వద్ద స్థిరపడింది.

ఫార్మా, పీఎస్​యూ బ్యాంకు రంగాలు మినహా.. మిగతావన్నీ డీలాపడ్డాయి. 

11:35 June 15

స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి. కరోనా సెకండ్​ వేవ్​ భయాలతో ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలే నష్టాలకు కారణం. బ్యాంకింగ్​, లోహ రంగాల షేర్లు భారీ ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఫార్మా మినహా మిగతా రంగాలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్​ 700 పాయింట్లకుపైగా నష్టపోయింది. ప్రస్తుతం 724 పాయింట్ల నష్టంతో 33 వేల 56 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ 9 వేల 8 వందల మార్కు దిగువకు చేరింది. 207 పాయింట్లు కోల్పోయి.. ప్రస్తుతం 9 వేల 766 వద్ద ట్రేడవుతోంది.

10:01 June 15

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, నిరంతర విదేశీ నిధుల ప్రవాహం కారణంగా స్టాక్​ మార్కెట్లు నష్టాలతో వారాన్ని ప్రారంభించాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభ ట్రేడింగ్​లో భారీగా నష్టపోయింది. ప్రస్తుతం 459 పాయింట్లు కోల్పోయి... 33 వేల 321 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 9854 వద్ద ట్రేడవుతోంది.

ముఖ్యంగా ఆర్థిక రంగ షేర్లు డీలాపడ్డాయి.   

రిలయన్స్​ జియో ప్లాట్​ఫాంలో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో.. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ షేర్లు దూసుకెళ్తున్నాయి.

నష్టాల్లోనివివే..

ఇండస్​ఇండ్​ బ్యాంక్​ భారీ నష్టాలను నమోదుచేసింది. 4 శాతానికి పైగా కోల్పోయింది. టాటా స్టీల్​, బజాజ్​ ఫినాన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఎన్టీపీసీ, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ నష్టపోయిన కంపెనీల జాబితాలో ఉన్నాయి.

సన్​ఫార్మా, ఇన్ఫోసిస్​, నెస్లే ఇండియా, ఏషియన్​ పెయింట్స్​ రాణిస్తున్నాయి.

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయన్న భయాలు అంతర్జాతీయ మార్కెట్లను వెంటాడుతున్నాయి. 

ఆసియా మార్కెట్లు...

ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్​, టోక్యో, సియోల్​ సూచీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 2.01 శాతం క్షీణించి.. బ్యారెల్​ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్​లో 37.95 డాలర్లకు చేరింది.

09:30 June 15

నష్టాల్లో స్టాక్​మార్కెట్లు.. 10 వేల దిగువకు నిఫ్టీ

స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్​ ఆరంభ ట్రేడింగ్​లో 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రస్తుతం 318 పాయింట్ల నష్టంతో 33 వేల 462 వద్ద కొనసాగుతోంది. 

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 9 వేల 9 వందల మార్కును కోల్పోయింది. ప్రస్తుతం 87 పాయింట్లు కోల్పోయి.. 9 వేల 885 వద్ద ట్రేడవుతోంది. 

ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలే నష్టాలకు కారణం. టాటా స్టీల్​, ఎల్​ అండ టీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎన్టీపీసీ, ఐటీసీ నష్టాల్లో ఉన్నాయి. 

Last Updated : Jun 15, 2020, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details