తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్బీఐ లెక్కలతో మార్కెట్లకు భారీ నష్టాలు

ఆర్​బీఐ కీలక వడ్డీరేట్లలో కోత విధించినా.... జీడీపీ వృద్ధిరేటు అంచనాలు తగ్గించడం కారణంగా స్టాక్​మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్​ 553 పాయింట్లు, నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయాయి. బ్యాంకింగ్​, ఇంధనం, ఉత్పాదక వస్తువులు తీవ్రనష్టాలు చవిచూశాయి.

ఆర్బీఐ లెక్కలతో మార్కెట్లకు భారీ నష్టాలు

By

Published : Jun 6, 2019, 4:12 PM IST

Updated : Jun 6, 2019, 4:35 PM IST

కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ... స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. జీడీపీ వృద్ధిరేటు అంచనాలు తగ్గించడం స్టాక్​మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

రెపోరేటును 0.25 శాతం తగ్గించిన ఆర్​బీఐ... 'తటస్థం' నుంచి 'సర్దుబాటు'కు తన ద్రవ్యవిధానాన్ని మార్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధిరేటును 7 శాతానికి తగ్గించింది. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తోడు దేశీయ ఆర్థిక కార్యకలాపాల్లో మందగమనమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

ఉదయం నుంచి ఒడుదొడుకులు మధ్య సాగిన స్టాక్​మార్కెట్లు... ఆర్​బీఐ నిర్ణయాల తరువాత భారీ నష్టాల దిశగా పయనించాయి. చివరకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 553.82 పాయింట్లు (1.38 శాతం) కోల్పోయి 39 వేల 529 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 177.90 పాయింట్లు (1.48 శాతం) పతనమై 11 వేల 843 వద్ద స్థిరపడింది.

లాభ-నష్టాలు..

కోల్​ఇండియా, పవర్ గ్రిడ్​ కార్ప్, ఎన్​టీపీసీ, హెచ్​యూఎల్​, హీరోమోటోకార్ప్​, టైటాన్, ఏసియన్ పెయింట్స్​, ఇన్ఫోసిస్​ (1.92 శాతం) స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.

గెయిల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎస్ బ్యాంక్​, ఎస్​బీఐ, ఎల్​ అండ్ టీ, టాటా స్టీల్, ఎమ్​ అండ్ ఎమ్, బజాజ్​ ఫైనాన్స్​, వేదాంత, టాటా మోటార్స్​, ఆర్ఐఎల్ (సుమారు 6.97 శాతం)​ భారీ నష్టాలు ముూటగట్టుకున్నాయి.

తగ్గిన చమురుధరలు

ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధర 0.76 శాతం తగ్గింది. ప్రస్తుతం ఒక బారెల్ ముడిచమురు ధర 61.09 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ

రూపాయి విలువ స్వల్పంగా తగ్గి ఒక డాలరుకు రూ.69.28లుగా ఉంది.

ఇదీ చూడండి: నిఫా టెర్రర్​: కేరళకు ఊరట- కర్ణాటక అలర్ట్

Last Updated : Jun 6, 2019, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details