తెలంగాణ

telangana

ETV Bharat / business

వెంటాడిన భయం- బ్యాంకింగ్​, ఆటో షేర్లు పతనం - నిఫ్టీ

బ్యాంకింగ్​, ఆటో రంగాల షేర్ల పతనంతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్​ 334 పాయింట్లు తగ్గి 40,445 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 12 వేల మార్కు దిగువకు చేరుకుంది.

Sensex
వెంటాడిన భయం- బ్యాంకింగ్​, ఆటో షేర్లు పతనం

By

Published : Dec 6, 2019, 4:24 PM IST

అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ట్రంప్ సానుకూల​ ప్రకటనతో ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు బ్యాంకింగ్​, ఆటో రంగాల షేర్ల పతనంతో నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచి, వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన క్రమంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించటమూ నష్టాలకు దారి తీసింది. నిఫ్టీ 12 వేల మార్కును కోల్పోయింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్​ 334 పాయింట్లు నష్టపోయిం 40,445 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ- 97 పాయింట్లు క్షీణించి 11, 921 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి..

ప్రైవేట్​ రంగం రుణదాతల రేటింగ్​ను మూడీస్​ సంస్థ తగ్గించిన క్రమంలో ఎస్​ బ్యాంకు 10 శాతం మేర నష్టపోయింది. ఎస్​బీఐ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, టాటా మోటర్స్​, మహీంద్ర&మహీంద్ర , హెచ్​డీఎఫ్​సీ నష్టాలు మూటగట్టుకున్నాయి.

కొటక్​ మహీంద్రా బ్యాంక్​, టాటా స్టీల్​, ఆర్​ఐఎల్​, ఏషియన్​ పేయింట్స్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ముగిశాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే.. 10 పైసలు క్షీణించి రూ. 71.30 వద్దకు చేరింది.

ఇదీ చూడండి: అలా అయితే వొడాఫోన్-ఐడియా మూసివేతే: బిర్లా

ABOUT THE AUTHOR

...view details