తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market: భారీ నష్టాలకు బ్రేక్​- సెన్సెక్స్​ 500.. నిఫ్టీ 150 ప్లస్​ - స్టాక్ మార్కెట్ న్యూస్

Stock market: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 497 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 16,771 వద్ద స్థిరపడింది. లోహా, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

Sensex closing
Sensex closing

By

Published : Dec 21, 2021, 3:54 PM IST

Updated : Dec 21, 2021, 5:15 PM IST

రెండు రోజులు భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 497 పాయింట్లు బలపడి.. 56,319 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 156 పాయింట్ల లాభపడి.. 16,771 వద్ద ముగిసింది.

ఐటీ, లోహ దన్నుతో సూచీలు లాభపడ్డాయి.

ఇంట్రాడే సాగిందిలా..

56,320 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ లాభాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 56,047 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్​.. కీలక రంగాల్లో మద్దతుతో ఒక దశలో 1000 పాయింట్లకు పైగా పుంజుకుని 56,900.74 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

నిఫ్టీ.. ఉదయం 16,773 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒకనొక దశలో 16,688 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది.

లాభనష్టాల్లోని ఇవే..

ముప్పై షేర్ల ఇండెక్స్​లో... పవర్​ గ్రిడ్​, యాక్సిస్ బ్యాంకు, బజాజ్​ఫైనాన్స్​, ఎస్​బీఐఎన్​, ఎం అండ్​ ఎం, హెచ్​డీఎఫ్​సీ, కొటక్​బ్యాంకు ​నష్టాల్లో ముగిశాయి.

ఇదీ చదవండి:ఆ జాబితాలో రిలయన్స్​కు అగ్రస్థానం!

Last Updated : Dec 21, 2021, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details