స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(Sensex today) 257 పాయింట్లు కోల్పోయి 59,772 వద్ద సెషన్‌ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ(Nifty today) 60 పాయింట్ల నష్టంతో 17,829 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
60,275 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 60,361 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. అయితే ఒడుదొడుకులు కొనసాగడం వల్ల 59,552 కనిష్ఠానికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 257 పాయింట్ల నష్టంతో 59,772 వద్ద ముగిసింది.
నిఫ్టీ 17,947 వద్ద ప్రారంభమై.. 17,757 వద్ద కనిష్ఠాన్ని తాకింది. వెంటనే పుంజుకుని 17,988 గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 17,829 వద్ద ముగిసింది.
ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు మార్కెట్ నష్టాలపై ప్రభావం చూపించాయి.
లాభనష్టాలు..
- ఎల్టీ, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, హిందాల్కో షేర్లు లాభాలను గడించాయి.
- సన్‌ఫార్మా, ఇండస్‌బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
ఇదీ చూడండి :పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకున్న 4 మార్గాలివే!