తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ, ఆటో షేర్లు అదుర్స్​- 51వేల పైకి సెన్సెక్స్ - షేర్ మార్కెట్​ న్యూస్ తెలుగు

ఐటీ, ఆటో షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్​ 380 పాయింట్లు బలపడి 51 వేల మార్క్ దాటింది. నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 15,300 పైన స్థిరపడింది.

stocks Update Telugu
స్టాక్ మార్కెట్ అప్​డేట్స్

By

Published : May 26, 2021, 3:49 PM IST

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 380 పాయింట్లు పెరిగి 51,017 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 15,301 వద్దకు చేరింది.

ఐటీ, ఆటో షేర్ల జోరు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కరోనా ఆందోళనలు కొనసాగుతున్నా ఈ స్థాయిలో లాభాలు నమోదు కావడం విశేషం.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 51,072 పాయింట్ల అత్యధిక స్థాయి, 50,620 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,319 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,194 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఫిన్​సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, ఎం&ఎం, మారుతీ, హెచ్​డీఎఫ్​సీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

పవర్​గ్రిడ్, ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై, నిక్కీ, హాంగ్​సెంగ్​ సూచీలు లాభాలను గడించాయి. కోస్పీ నష్టాలను నమోదు చేసింది.

ఇదీ చదవండి:'ఏటా 200 కోట్ల డోసుల తయారీకి సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details