తెలంగాణ

telangana

సెన్సెక్స్​ నయా రికార్డ్​: 55వేల మార్క్​ను దాటిన సూచీ

By

Published : Aug 13, 2021, 9:25 AM IST

Updated : Aug 13, 2021, 11:34 AM IST

sensex claims record 55,000
రికార్డులు సృష్టించిన స్టాక్స్ మార్కెట్లు

09:20 August 13

సెన్సెక్స్​ రికార్డ్

స్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్ 237 పాయింట్లు వృద్ధి చెంది 55 వేల మార్కుని దాటింది. ప్రస్తుతం 55,096 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలతోనే ట్రేడింగ్ ఆరంభించింది. 60 పాయింట్లు ఎగబాకి.. 16,425 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాలు...
మహీంద్ర అండ్​ మహీంద్ర, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​ అండ్​ టీ, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, టీసీఎస్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 
టెక్​ మహీంద్ర, పవర్​గ్రిడ్​, టాటా స్టీల్​, సన్​ఫర్మా, డాక్టర్​ రెడ్డీస్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Aug 13, 2021, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details