తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయి భారీ పతనం- జీవితకాల కనిష్ఠం నమోదు

కరోనా భయాలతో రూపాయి కుచించుకుపోయింది. స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో కుదేలైన వేళ 102 పైసలు పతనమైంది. డాలరుతో పోలిస్తే మారకం విలువ 76.22కు చేరుకుని జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

BIZ-RUPEE-CLOSE
రూపాయి

By

Published : Mar 23, 2020, 6:27 PM IST

దేశీయ స్టాక్​ మార్కెట్లు 'మహా' పతనంతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. 102 పైసలు పడిపోయిన రూపాయి.. డాలరుతో పోలిస్తే 76.22కు చేరుకుని జీవితకాల కనిష్ఠాన్ని తాకింది.

దేశంలో కరోనా వైరస్ కేసులు 400 దాటిన నేపథ్యంలో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయని ఫారెక్స్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు 11 బిలియన్​ డాలర్లకు చేరుకోవటమూ కారణమని భావిస్తున్నారు.

ఫారెక్స్ మార్కెట్​లో సోమవారం 75.90 వద్ద ప్రారంభమైన రూపాయి ఒకానొక దశలో 110 పైసలు పతనమై 76.30కు చేరుకుంది. కొంత ఊగిసలాట తర్వాత 76.22 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:ఢమాల్​ స్ట్రీట్​: సెన్సెక్స్​ 3,935 పాయింట్లు పతనం

ABOUT THE AUTHOR

...view details