స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీల్లో అత్యంత విలువ కలిగిన తొలి పది సంస్థల్లో ఏడింటి విలువ గతవారం గణనీయంగా పడిపోయింది. గడిచిన వారం రోజుల్లో ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,07,566.64 కోట్లు తగ్గింది. మార్కెట్ నష్టపోయిన సొమ్ములో సగం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిందే కావడం గమనార్హం. గత వారం సెన్సెక్స్ 849.74 పాయింట్లు కోల్పోయింది. టీసీఎస్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే లాభాల్ని ఆర్జించగలిగాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.55,565.21 కోట్లు తగ్గి 12,64,243.20 కోట్లకు చేరింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ.2,408.22 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ.5,467.63 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.3,751.92 కోట్లు, టీసీఎస్ రూ.12,420.4 కోట్లు, ఎస్‌బీఐ విలువ రూ.12,494.45 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.6,313.77 కోట్లు, బజాజ్ ఫినాన్స్ రూ.16,197.55 కోట్లు, కొటాక్ మహీంద్రా బ్యాంక్ విలువ రూ.11,681.66 కోట్లు కుంగింది. ఇక వీటిని భిన్నంగా హెచ్‌యూఎల్ రూ.364.19 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.62.77 కోట్లు, టీసీఎస్ తమ మార్కెట్ విలువకు రూ.1,812.54 కోట్లు జోడించాయి.