తెలంగాణ

telangana

ETV Bharat / business

Reasons For Market Crash: భారీ నష్టాల్లో మార్కెట్లు.. కారణాలివే... - స్టాక్​ మార్కెట్​ న్యూస్​

Reasons For Stock Market Crash: స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. సెన్సెక్స్ 1,500 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ.. 500 పాయింట్లు క్షీణించింది. మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోవడానికి గల కారణాలు ఏంటో ఓ సారి చూద్దాం.

Reasons For Market Crash
భారీ నష్టాల్లో సూచీలు.. కారణాలివే!

By

Published : Jan 24, 2022, 1:28 PM IST

Updated : Jan 24, 2022, 2:00 PM IST

Reasons For Stock Market Crash: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నడుమ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఆసియా మార్కెట్ల పతనం, దిగ్గజ షేర్లలో అమ్మకాలు సూచీలను మరింత కిందకు లాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ 1500 పాయింట్లకుపైగా నష్టంతో, నిఫ్టీ 500 పాయింట్లు క్షీణించాయి.

పతనానికి ప్రధాన కారణాలివే..

  1. గతవారం అంతర్జాతీయంగా దాదాపు అన్ని మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నాస్‌డాక్‌ ఏకంగా ఇటీవలి గరిష్ఠాల నుంచి 16 శాతం కుంగడం గమనార్హం. ఈ ప్రభావం సూచీలపై గట్టిగా పడింది. దీంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
  2. నాస్​డాక్​లో టెక్ స్టాక్‌లు భారీ నష్టాలను చవిచూడడం కూడా మదుపరులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రభావం ఐటీ రంగంపై పడింది.
  3. మంగళవారం అమెరికాలో ఫెడ్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వడ్డీరేట్ల పెంపు తప్పదని ఇప్పటికే సంకేతాలిచ్చిన ఫెడ్‌.. దాన్ని ఎంత వేగంగా.. ఎన్ని దశల్లో అమలు చేయనుందో ఈ భేటీ స్పష్టం చేయనుంది. ఇదే జరిగితే మార్కెటింగ్​ వ్యవస్థపై గట్టి ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
  4. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలోనూ ఫెడ్​ వడ్డీరేట్ల పెంపు వాయిదా లేకపోవడం కూడా మదుపర్లను కలవపరుస్తోంది.
  5. అమెరికాలో నిరుద్యోగం పెరగడం కూడా సూచీలు నష్టాలకు కారణం అయ్యింది.
  6. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న వివాదంపైనా మదుపర్లు దృష్టి పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా తగ్గించింది.
  7. విదేశీ సంస్థాగత మదుపర్లు ఏకంగా రూ.12,600 కోట్లకు పైగా అమ్మకాలు దిగారు. దేశీయ మదుపర్లు సైతం అదే బాటలో పయనిస్తున్నారు.
  8. గత ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీలన్నీ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. లిస్టింగ్‌లో అదరగొట్టిన జొమాటో వంటి షేర్లు ఇష్యూ ధర కంటే 10 శాతం కింద ట్రేడవుతుండడం గమనార్హం. ఇక పేటీఎం షేరు ఏకంగా 50 శాతం నష్టంతో కొనసాగుతోంది.
  9. ఐటీ, లోహ, ఫార్మా, రియాల్టీ రంగాల షేర్లు మూకుమ్మడిగా డీలా పడటం వల్ల మార్కెట్లు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి.
  10. ముప్పై షేర్ల ఇండెక్స్​ కూడా పూర్తి స్థాయిలో ఎరుపు రంగు పులుముకోవడం గమనార్హం.
Last Updated : Jan 24, 2022, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details