తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాల్లో మార్కెట్లు- కారణాలివే! - బొంబాయి స్టాక్​ ఎక్సేంజి

దేశంలో రెండో దశ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్తగా సుమారు లక్షా 68 వేల కేసులు నమోదయ్యాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్రంగా పడింది. సూచీలు రికార్డు స్థాయి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారీ నష్టాలకు నిపుణులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి.

reason behind stock market crash today
భారీ నష్టాల్లో మార్కెట్లు- కారణాలివే!

By

Published : Apr 12, 2021, 1:39 PM IST

కరోనా భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 1680 పాయింట్లకు పైగా కోల్పోయి 47,902 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 516 పాయింట్లకు పైగా నష్టపోయి 14,312 వద్ద ట్రేడవుతోంది. ఈ స్థాయి నష్టాలకు కారణాలు ఇలా ఉన్నాయి.

  • దేశీయంగా కరోనా కేసులు భారీస్థాయిలో వెలుగు చూడడం మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది.
  • చాలా నగరాల్లో కరోనా ఆంక్షలను కఠినతరం చేయడంతో వ్యాపారాలపై మళ్లీ ప్రభావం చూపిస్తుందనే భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి.
  • దేశ జీడీపీలో 13 శాతం వాటా ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటమూ ఓ కారణం.
  • అంతర్జాతీయంగా కూడా పెరుగుతోన్న కరోనా కేసులు విదేశీ సంస్థాగత మదుపరులను వెనకడుగు వేసేలా చేస్తున్నాయి.
  • ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కూడా నష్టాలకు మరో కారణంగా తెలుస్తోంది.
  • మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సోమవారమే వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు.
  • భారీ నష్టాలతో బీఎస్​ఈ మదుపరుల సంపద (మిడ్​ సెషన్​ ముందు వరకు) రూ.6.86 లక్షల కోట్లు ఆవిరైంది.
  • మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం ఒక్కటి కూడా లేకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ABOUT THE AUTHOR

...view details