తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ ఉద్దీపనలతో భరోసా- సెన్సెక్స్ 986 పాయింట్లు ప్లస్ - stock price

భారతీయ రిజర్వు బ్యాంక్ ప్రకటించిన ఉద్దీపన పథకాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 986 పాయింట్లు బలపడి 31,589 వద్ద ముగిసింది. నిఫ్టీ 274 పాయింట్లు వృద్ధి చెందింది. బ్యాంకింగ్ రంగ షేర్లు గణనీయమైన లాభాలు నమోదు చేశాయి.

nifty
సెన్సెక్స్ టుడే

By

Published : Apr 17, 2020, 3:46 PM IST

బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రిజర్వు బ్యాంకు ప్రకటించిన ఉద్దీపన చర్యలు మార్కెట్లలో జోరు నింపాయి. కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ.50 వేల కోట్లతో ఎల్​టీఆర్​ఓ ప్రకటించడం వల్ల స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.

ఇవాళ్టి ట్రేడింగ్​లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేజీ సూచీ సెన్సెక్స్ 986 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 31,589 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ రంగ షేర్లు ఆకాశమే హద్దుగా చెలరేగాయి.

యాక్సిస్ బ్యాంక్ 14 శాతం వృద్ధి చెందింది. ఐసీఐసీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు 8 శాతానికి పైగా పెరిగాయి. వీటితో పాటు మారుతీ, టీసీఎస్, రిలయన్స్, కొటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాల్లో పయనించాయి.

మరోవైపు నెస్లే, హెచ్​యూఎల్, టెక్ మహీంద్ర, సన్ ఫార్మా షేర్లు నష్టాలపాలయ్యాయి.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం భారీ లాభాలు నమోదు చేసింది. 274 పాయింట్లు వృద్ధి చెంది 9,267 వద్ద ముగిసింది.

ABOUT THE AUTHOR

...view details