వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ప్రకటన, పీఎంఐ డేటా, దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, అంతర్జాతీయ పరిస్థితులు ఈ వారం స్టాక్ మార్కెట్లను నడిపించనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరాన్ని లాభాల్లో ప్రారంభించిన సూచీలు ఈ వారంలో మిశ్రమంగా కదలాడే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"ఇటీవల అమెరికా అధ్యక్షుడు పెట్టుబడులకు సంబంధించిన ఓ ప్రణాళికను ప్రకటించారు. దీంతో మదుపరులు అంతర్జాతీయ సూచనల ఆధారంగా పెట్టుబడులు పెట్టవచ్చు. రాబోయే త్రైమాసిక ఫలితాలుపైనా వారు దృష్టి సారించే అవకాశం ఉంది. ఇదే సమయంలో దేశీయంగా పెరుగుతోన్న కరోనా కేసులు, లాక్డౌన్ భయాలు మదుపరులను కొంత భయానికి గురి చేస్తాయి. ఈ క్రమంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదముంది."
-సిద్ధార్థ్ ఖేమ్కా, మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ హెడ్
"ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏప్రిల్ 5 నుంచి 7 వరకు సమావేశం కానుంది. దీనితో పాటు తయారీ, సేవల రంగాలకు సంబంధించిన పీఎంఐ డేటా కూడా ఈ వారంలో ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు అంశాలు మదుపరులను ప్రభావితం చేయవచ్చు. దీంతో సూచీలు కొంతమేర ముందుకుసాగే అవకాశం ఉంది."