ఈ వారం స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాలు, త్రైమాసిక ఫలితాల ప్రభావమే అధికంగా ఉండనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌ను ప్రభావితం చేసేంత పెద్ద వార్తలేమి లేకపోవడం వల్ల మదుపరులు తిరిగి ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
గతవారం కేంద్ర బడ్జెట్, ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం లాంటి రెండు ప్రధానాంశాలతో మార్కెట్ సూచీలు జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 51 వేల మార్క్‌ను తాకింది. అయితే ఈ వారం మార్కెట్ కొంత ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.
"మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్తలు ఈ వారంలో లేవు. దీంతో ఆయా కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌కు దన్నుగా నిలిచే అవకాశం ఉంది."