త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు(Market Outlook) ఈ వారం స్టాక్ మార్కెట్లకు(Stock market) కీలకం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
"ఈ వారం మార్కెట్లకు త్రైమాసిక ఫలితాలు దిక్చూచిగా మారనున్నాయి. తొలి త్రైమాసికంతో పోలిస్తే.. క్యూ2లో కంపెనీలు భారీగా పుంజుకున్నాయి. ఆ అంచనాలతో మదుపరులు పెట్టుబడులకు మొగ్గు చూపవచ్చు. దాని ఫలితంగా మార్కెట్ అంచనాలను అధిగమించే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రతికూలతలకూ అవకాశం లేకపోలేదు."
- యేశా షా, సామ్కో సెక్యూరిటీస్ అధినేత.
ఈ వారంలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఏషియన్ పెయిట్స్, హిందుస్థాన్ జింక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్నాయి. కొద్ది కాలంగా అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా వార్తలు కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. క్యూ2లో అదరగొట్టిన అవెన్యూ సూపర్ మార్కెట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలపైనా దృష్టి సారించే అవకాశం ఉందంటున్నారు.
ఇదీ చూడండి:హెచ్డీఎఫ్సీ- డీమార్ట్‌కు లాభాల పంట