కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, దేశంలో వ్యాక్సినేషన్ సంబంధిత వార్తలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయి.
ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసేందుకు కీలకమైన అంశాలు పెద్దగా లేనందున మదుపరులు అంతర్జాతీయ సూచీల కదలికలు, అమెరికా బాండ్ల మార్కెట్, ముడి చమురు ధరలు, రూపాయి విలువ హెచ్చుతగ్గులపైన ఎక్కువగా దృష్టి సారించే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు.
'దేశంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ అప్డేట్స్ ఈ వారం స్టాక్ మార్కెట్లను కీలకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంద'ని రెలిగేర్ బ్రోకింగ్ పరిశోధనా విభాగం ఉపాధ్యక్షుడు అజిత్ మిశ్రా పేర్కొన్నారు.