తెలంగాణ

telangana

ETV Bharat / business

హైదరాబాద్​లో సెంచరీ కొట్టిన డీజిల్ ధర - హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర ఎంత?

దేశంలో చమురు ధరల (Petrol price today)​ బాదుడు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

PETROL PRICE TODAY
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

By

Published : Oct 7, 2021, 7:48 AM IST

Updated : Oct 7, 2021, 9:54 AM IST

దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది(Petrol price hike). దేశవ్యాప్తంగా గురువారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర ​30 పైసలు.. డీజిల్​ ధర 35 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.103.24కు చేరగా..​ లీటర్ డీజిల్ ధర రూ.91.78గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109.22గా ఉంది. డీజిల్ ధర రూ.99.51కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో...

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 32 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.107.36కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు అధికమై.. లీటర్​కు రూ.100.09కు చేరింది.
  • విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 30 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.108.25కు చేరుకుంది. డీజిల్​పై 37 పైసలు పెరిగి.. రూ.100.47కు చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 30 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.109.52గా ఉంది. డీజిల్​ లీటర్​కు 37 పైసలు పెరిగి.. రూ.101.7 వద్ద ఉంది.

ఇదీ చూడండి:రూ.5 లక్షల్లో కొత్త కార్​ కొనాలా? ఇవి చూడండి...

ఇదీ చూడండి:భద్రతతో పాటు ఆదాయానిచ్చే ఎస్​బీఐ గోల్డ్ స్కీం

Last Updated : Oct 7, 2021, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details