దాదాపు నెలరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు (Petrol Price today) ఆదివారం స్వల్పంగా తగ్గింది. లీటర్ పెట్రోల్‌పై 20పైసలు తగ్గింది. మరోవైపు డీజిల్ ధర కూడా 20పైసలు తగ్గింది. వారం వ్యవధిలో.. డీజిల్ ధర తగ్గడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్((Petrol Price in Hyderabad) ధర రూ.105.69, డీజిల్ ధర రూ.97.15కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడం వల్ల దేశీయ విక్రయ సంస్థలు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో అక్టోబర్ కాంట్రాక్టుకు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 66.72 డాలర్లుగా పలుకుతోంది.