దేశంలో ఇంధన ధరల పెంపు నిత్యకృత్యంగా మారింది. దేశవ్యాప్తంగా శనివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దిల్లీలో (Fuel Price Today) లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు పెరగ్గా.. డీజిల్పై 35 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.84కు చేరగా.. డీజిల్ ధర రూ.92.48కి పెరిగింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109.8గా ఉంది. డీజిల్ ధర రూ.100.25కు చేరింది.