భారత్లో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం.. దిల్లీలో (Fuel Price Today) లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరగ్గా.. డీజిల్పై 30 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.39కి చేరగా.. డీజిల్ ధర రూ.90.78కి పెరిగింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.108.39గా ఉంది. డీజిల్ ధర రూ.98.44కి చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో...
- హైదరాబాద్లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 26 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.106.47కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 32 పైసలు అధికమై.. లీటర్కు రూ.99.00కు చేరింది.
- విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 25 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.107.40కు చేరుకుంది. డీజిల్పై 32 పైసలు పెరిగి.. రూ.99.42కు చేరింది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 26 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్ ధర రూ.108.67గా ఉంది. డీజిల్ లీటర్కు 32 పైసలు పెరిగి.. రూ.100.65 వద్ద ఉంది.
ఇదీ చూడండి:దసరా వచ్చేస్తోంది.. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండిలా!