తెలంగాణ

telangana

ETV Bharat / business

అక్కడా సానుకూలతే... చమురు ధర 6% వృద్ధి

మధ్యాహ్నం సెషన్​లో ఆసియా మార్కెట్లు కోలుకోవటం వల్ల చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 4 శాతం, బ్రెంట్​ 3.9 శాతం పెరుగుదల నమోదు చేశాయి.

crude
చమురు

By

Published : Mar 13, 2020, 3:48 PM IST

చమురు ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నవేళ 2 శాతం పడిపోయిన క్రూడ్​ ధరలు.. 6 శాతం రికవరీని సాధించాయి.

మధ్యాహ్నానికి ఆసియా మార్కెట్లు కోలుకోవటం వల్ల డబ్ల్యూటీఐ క్రూడ్​ ధర 4 శాతం పెరిగి 33 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం వృద్ధి చెంది 34.50 డాలర్ల వద్ద స్థిరపడింది.

తక్కువ స్థాయిలోనే..

రష్యా, సౌదీ చమురు యుద్ధం కారణంగా ఈ వారంలో డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 20 శాతానికి పడిపోయి 10 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం పెరుగుదల నమోదు చేసినా ఆ స్థాయి నుంచి మాత్రం కోలుకోలేదు. ఈ వారంలో బ్రెంట్ ధరలు 25 శాతానికి పైగా పడిపోయాయి.

కరోనా ప్రభావంతో ప్రపంచ వృద్ధిపై నెలకొన్న భయాలతో పాటు రష్యా, సౌదీ చమురు యుద్ధం ధరల పతనానికి దారి తీసింది. ఆర్థిక వేత్తల వృద్ధి అంచనాలు, వడ్డీ రేట్ల తగ్గింపులో కేంద్ర బ్యాంకుల ఉత్సాహం చమురు ధరల పతనానికి దారితీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:కోలుకున్న మార్కెట్లు- సెన్సెక్స్​ రికార్డు రికవరీ

ABOUT THE AUTHOR

...view details