వరుస నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. వారాంతపు సెషన్లో.. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 166 పాయింట్లు పుంజుకుని 52,484 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 42 పాయింట్ల లాభంతో 15,722 వద్దకు చేరింది.
ఇన్ఫ్రా, ఫార్మా, బ్యాంకింగ్ షేర్ల దన్నుతో లాభాలను నమోదు చేశాయి సూచీలు. కాగా, లోహ, విద్యుత్ రంగ షేర్ల అమ్మకాలు లాభాలను పరిమితం చేశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,527 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,177 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,738 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 15,635 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.