తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆటో షేర్ల​ దన్నుతో మార్కెట్లకు లాభాలు - బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి

దేశీయ స్టాక్​ మార్కెట్ల్​ వారాంతంలో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆటో షేర్ల దన్నుతో సెన్సెక్స్​ 127 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్ల మేర లాభపడ్డాయి.

stock markets
దేశీయ స్టాక్​ మార్కెట్లు

By

Published : Oct 23, 2020, 3:42 PM IST

ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్​ మార్కెట్లు.. ఒడుదొడుకులకు లోనైనప్పటికీ ఆటో షేర్ల దన్నుతో ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​.. 127 పాయింట్ల లాభంతో 40,685 పాయింట్ల వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ.. 34 పాయింట్ల వృద్ధితో 11,930 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి..

మారుతీ సుజుకీ అత్యధికంగా 4.46 శాతం లాభపడింది. ఎం అండ్ ​ఎం, టాటా స్టీల్​, పవర్​ గ్రిడ్​, బజాజ్​ ఆటోలు లాభాల్లో ముగిశాయి.

శ్రీ సిమెంట్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, గెయిల్​, హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​యూఎల్​ నష్టాలు మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: అంకురాలకు పండుగ కలిసొచ్చేనా?

ABOUT THE AUTHOR

...view details