జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా నిఫ్టీకి చెందిన ఆన్ని సూచీల్లో లైవ్‌లో ప్రైస్ కోట్స్ అప్‌డేట్ కావడం లేదు. అన్ని బ్రోకరేజ్ సంస్థలు ఈ విషయాన్ని తమ వినియోగదారులకు తెలిపాయి.
"ఎన్ఎస్ఈ సూచీల లైవ్ టిక్స్తో సమస్య తలెత్తింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మేము ఎన్ఎస్ఈతో సంప్రదింపులు జరుపుతున్నాం," జెరోధా, ప్రముఖ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్.
నిఫ్టీ 112.65 పాయింట్ల లాభంతో.. 14,820.45 వద్ద, నిఫ్టీ బ్యాంక్ 509.65 పాయింట్ల వృద్ధితో 35,626.60 వద్ద నిలిచిపోయాయి. ఉదయం 10:10 నిమిషాలకు సూచీలు చివరి సారిగా అప్‌డేట్ అయ్యాయి. నిఫ్టీ అప్డేట్స్ నిలిచిపోయిన విషయంపై రిటైల్ మదుపరులు ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లైవ్ కోట్స్ అప్డేట్స్ నిలిచిపోయిన దాదాపు రెండు గంటల తర్వాత ఎన్ఎస్ఈ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 11:40 గంటలకు అన్ని సెగ్మెంట్లను నిలిపేసినట్లు తెలిపింది. వీలైనంత త్వరగా లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి:మీడియా రంగం పుంజుకుంటుంది: క్రిసిల్