తెలంగాణ

telangana

ETV Bharat / business

ముగిసిన 'ముహురత్'- దూసుకెళ్లిన సూచీలు -

muhurat-trading-live-what-to-expect-from-samvat-2077
కాసేపట్లో ప్రారంభం కానున్న 'ముహురత్' ట్రేడింగ్

By

Published : Nov 14, 2020, 6:12 PM IST

Updated : Nov 14, 2020, 7:41 PM IST

19:39 November 14

ముహురత్ ట్రేడింగ్​లో దేశీయ స్టాక్ మార్కెట్లు తారాజువ్వల్లా ఎగసిపడ్డాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సెషన్​లో రికార్డు స్థాయి గరిష్ఠాలకు చేరాయి. 

195 పాయింట్లు లాభపడ్డ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​... 43,638 పాయింట్ల జీవితకాల గరిష్ఠానికి చేరింది. మరోవైపు, 51 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ.. 12,771 వద్ద ట్రేడింగ్ ముగించింది.

19:26 November 14

దీపావళికి భారత స్టాక్ మార్కెట్లు నిర్వహించే ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్ ముగిసింది. గంట పాటు నిర్వహించిన ట్రేడింగ్​లో సూచీలు రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేశాయి. 

19:04 November 14

ముహురత్ ట్రేడింగ్​లో సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు వృద్ధి చెంది.. 43,697 పాయింట్ల మార్క్​ను అందుకుంది.  

మరోవైపు, 80 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ.. 12,800 వద్ద ట్రేడవుతోంది.

18:37 November 14

సంవత్‌ 2077ను మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. దీపావళిని పురస్కరించుకుని గంటపాటు జరిగే మూరత్‌ ట్రేడింగ్‌లో సూచీలు మరోసారి జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 271 పాయింట్ల లాభంతో 43,714 వద్ద, నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 12,800 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. 7.15 గంటలకు ట్రేడింగ్‌ ముగియనుంది.

18:23 November 14

దీపావళికి భారత స్టాక్ మార్కెట్లు నిర్వహించే ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్ ప్రారంభమైంది.

18:05 November 14

లైవ్​: 'ముహురత్' ట్రేడింగ్

దీపావళికి భారత స్టాక్ మార్కెట్లు నిర్వహించే ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 

ముహురత్ ట్రేడింగ్ అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతోన్న సంప్రదాయం. ముహురత్ ట్రేడింగ్ మొదట బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1957లో ప్రారంభించారు. తర్వాత 1992లో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపించినప్పుడు అదే ఏడాది ఈ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ ట్రేడింగ్ తో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు.

సంపదకు, ధనానికి దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తూ చేసే ట్రేడింగ్ అని, హిందూ కొత్త సంవత్సరమైన సంవత్ ప్రారంభాన్ని చేసుకోవటం అని ట్రేడర్లు నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ముహురత్​ను మంచి సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చేసిన పని మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ట్రేడింగ్ ప్రారంభమవగానే కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు. ఈ గంట సమయంలో ట్రేడింగ్ చేసిన వారికి సంవత్సరం మొత్తం ఎక్కువ లాభాలు వస్తాయని ఒక నమ్మకం ఉంది. ఈ సమయంలో కొంత మొత్తంలో కొనుగోలు చేయటం ద్వారా లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఇస్తుందని కొంత మంది నమ్ముతుంటారు.

ఈ సారి దీపావళి నవంబర్ 14న రానుంది. ఆ రోజు సాయంత్రం 6.15 నుంచి 07:15 వరకు ముహురత్ ట్రేడింగ్ జరగనుంది. సంవత్ 2076 ముగిసి... సంవత్ 2077 ప్రారంభంకానుంది.

2009 నుంచి నిఫ్టీ ఒక్క సారి కూడా ఈ ట్రేడింగ్ సమయంలో 1 శాతం కూడా పెరగలేదు. 2008లో ఆరు శాతం పెరిగింది.

Last Updated : Nov 14, 2020, 7:41 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details