తెలంగాణ

telangana

ETV Bharat / business

'కొవిడ్​తో ఆరోగ్యంపై అవగాహన, ఆరోగ్య బీమా పట్ల చైతన్యం పెరిగాయి' - telangana latest news

తెలంగాణలో మాక్స్ భూపా ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు ప్రాంతీయ కార్యాలయాలు, ఏజెంట్​లను పెంచుకుంటున్నట్టు... తెలంగాణ హెడ్ నాగరాజు కీర్తి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 3.5 లక్షల మంది ప్రజలను ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకొస్తామన్నారు

max bhupa health insurence company telangana state meeting
'కొవిడ్​తో ఆరోగ్యంపై అవగాహన, ఆరోగ్య బీమా పట్ల చైతన్యం పెరిగాయి'

By

Published : Feb 16, 2021, 5:45 PM IST

కోవిడ్ మహమ్మారి ఆరోగ్యం పట్ల అవగాహన, ఆరోగ్య బీమా పట్ల చైతన్యాన్ని నాలుగు రెట్లు పెంచిందని ప్రైవేట్ ఇన్సూరెన్స్ దిగ్గజం మ్యాక్స్ భూపా ప్రకటించింది. తెలంగాణలో ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో ప్రాంతీయ కార్యాలయాలు, ఏజెంట్​ల సంఖ్యను మరింత పెంచుకుంటున్నట్లు తెలంగాణ హెడ్ నాగరాజు కీర్తి స్పష్టం చేశారు.

రాబోయే ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 3.5 లక్షల మంది ప్రజలను ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకొస్తామని... రాబోయే ఐదేళ్లలో రూ.240 కోట్ల గ్రాస్ రిటర్న్ ప్రీమియం తమ లక్ష్యమని వెల్లడించారు. కొవిడ్ నేపథ్యంలో ఇన్యూరెన్స్ పొందగోరే వారికి నెలవారీ వాయిదాలు సైతం ఇకపై అందుబాటులోకి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఈ ఏడాది మీ పొదుపును పరుగులు పెట్టించాలంటే..

ABOUT THE AUTHOR

...view details