తెలంగాణ

telangana

ETV Bharat / business

కాలుష్యరహిత మారుతీ కారు - ENVIRONMENT ECO CARS

ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ "మారుతీ సుజుకీ" కాలుష్య రహిత ఇంధనాలతో నడిచే వాహనాలను తయారు చేసింది.  సీఎన్​జీతో(బయో ఇంధనం) పనిచేసే రెండు కొత్త వేగనార్​ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

పర్యావరణ హితమైన కారును తయారు చేసిన మారుతీ సుజుకీ సంస్థ

By

Published : Mar 6, 2019, 6:28 PM IST

మారుతీ సుజుకీ కాలుష్య ర‌హిత వాహనాల తయారీపై దృష్టి సారించింది. అందులో భాగంగానే "వేగనార్​" మోడల్​లో... సీఎన్​జీ(కంప్రెస్డ్​ నేచురల్​ గ్యాస్​)తో నడిచే రెండు కార్లను ఈరోజు విడుదల చేసింది. వీటి ఎక్స్​ షోరూం ధర రూ.4.84 లక్షలు, రూ.4.89 లక్షలుగా నిర్ణయించారు. లీటరు ఇంధనంతో 33.54 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం వీటి ప్రత్యేకత.

ఈ వేగనార్ సీఎన్​జీ కార్లు పర్యావరణ హితమైనవి. గ్యాస్​ సాయంతో నడిచే ఈ వాహనాల్లో భద్రత విషయంలో రాజీ లేదు. సాంకేతికత సాయంతో అన్ని ఏర్పాట్లు చేశాం
--ఆర్.ఎస్.కల్సి, మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్.

దిల్లీ-ఎన్​సీఆర్, గుజరాత్, ముంబయి, పూణె, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో ఈ కార్లు అందుబాటులో ఉండనున్నాయి.

మంచి పికప్, భద్రతతో కూడిన డ్రైవింగ్ సదుపాయం, డ్యూయల్ ఈసీయూ(ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్), ఇంటెలిజెంట్ గ్యాస్ పోర్ట్ ఇంజెక్షన్ సాంకేతికత కలిగి ఉందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ప్రస్తుత మోడళ్లలో ఏడు కార్లకు(ఆల్టో800, ఆల్టో కె10, వేగనార్​, సిలిరియో, ఈకో, సూపర్ క్యారీ, టూర్ ఎస్) సీఎన్​జీ సదుపాయం కల్పించింది మారుతీ సుజుకీ. పర్యావరణాన్ని కలుషితం చేసే ఉద్గారాల నియంత్రణకు మరింత కృషి చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details