తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుస లాభాలతో సరికొత్త శిఖరాలకు మార్కెట్లు

లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరాయి. సెన్సెక్స్ 315 పాయింట్లు పెరిగి 44 వేలకు దిగువన స్థిరపడింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడింది.

stocks
మార్కెట్లు

By

Published : Nov 17, 2020, 3:50 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ- సెన్సెక్స్ 315 పాయింట్లు బలపడి 43,953 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 94 పాయింట్ల పెరిగి 12,874 పాయింట్లకు చేరింది.

ప్రారంభ సెషన్​లో భారీగా లాభాలు ఆర్జించిన సెన్సెక్స్​.. మొదటిసారి 44వేల మార్కును దాటింది. తర్వాత స్పల్పంగా నెమ్మదించి 44 వేల దిగువన స్థిరపడింది. దేశీయ మార్కెట్లు ఇదే జోరు కొనసాగిస్తే 2020లోపే సెన్సెక్స్ 45 వేల మార్కును అందుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

లాభనష్టాల్లో..

టాటాస్టీల్, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్​ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్​ అండ్ టీ షేర్లు రాణించాయి.

ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, హెచ్​సీఎల్​టెక్​, ఇన్ఫోసిస్, హిందుస్థాన్​ యూనిలీవర్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

ABOUT THE AUTHOR

...view details