తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక షేర్ల జోరు- లాభాల్లో మార్కెట్లు - బొంబాయి స్టాక్​ ఎక్సేంజి

Markets at a loss with rising corona cases
పెరుగుతోన్న కరోనా కేసులతో నష్టాల్లోకి మార్కెట్లు

By

Published : Mar 19, 2021, 9:25 AM IST

Updated : Mar 19, 2021, 2:28 PM IST

14:22 March 19

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 409 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం 49,626 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్సేంజీ-నిఫ్టీ 120పాయింట్ల లాభంతో 14,6678 వద్ద ట్రేడవుతోంది.

విద్యుత్​, ఎఫ్​ఎంసీజీ షేర్లు రాణిస్తున్నాయి. 

లాభనష్టాల్లో..

 పవర్​గ్రిడ్, ఎన్​టీపీసీ, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, కోటక్​ బ్యాంక్​, ఎస్​బీఐ​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో టెక్​ మహేంద్ర ,బజాజ్​ ఆటో, మారుతి, ఎం అండ్​ ఎం, బజాజ్​ ఫినాన్స్​, ఎల్ అండ్​ టీ షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.

11:04 March 19

భారీ ఒడుదొడుకుల నుంచి కోలుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 288 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం 49,504 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్సేంజీ-నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 14,633 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

 పవర్​గ్రిడ్, ఎన్​టీపీసీ, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, కోటక్​ బ్యాంక్​, ఎస్​బీఐ​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో బజాజ్​ ఆటో, మారుతి, ఎం అండ్​ ఎం, బజాజ్​ ఫినాన్స్​, ఎల్ అండ్​ టీ షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.

10:18 March 19

సెన్సెక్స్​ 110 పాయింట్లు కోల్పోయి 49,105 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 34పాయింట్ల నష్టంతో 14,522 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికాలో నెలకొన్న ద్రవ్యోల్భణ పరిస్థితులు.. విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్లను దెబ్బతీశాయి. ఈ క్రమంలో వాహన, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వెల్లువెత్తుతున్న అమ్మకాలతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరగడమూ మదుపర్ల సెంటిమెంట్​ను దెబ్బతీసింది.

  • ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్​, కోటక్ బ్యాంక్​​,హెచ్​సీఎల్​ టెక్​, సన్​ఫార్మా, పవర్​ గ్రిడ్​ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • మారుతీ, ఓఎన్​జీసీ, అల్ట్రాటెక్​ సిమెంట్, టైటాన్​, ఎస్​బీఐ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్​ నష్టాల్లో ఉన్నాయి.

08:48 March 19

స్టాక్​ మార్కెట్స్​ లైవ్ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 330 పాయింట్లకుపైగా కోల్పోయి 49,885 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 163 పాయింట్ల నష్టంతో 14,557వద్ద కొనసాగుతోంది.

వాహన, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వెల్లువెత్తుతున్న అమ్మకాలతో పాటు, దేశ వ్యాప్తంగా కరోనా కేసుల భారీగా వెలుగు చూడడం కూడా నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

  • ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్​ ఫినాస్స్​, పవర్​ గ్రిడ్​ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • మారుతీ, ఓఎన్​జీసీ, అల్ట్రాటెక్​ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్​ నష్టాల్లో ఉన్నాయి.
Last Updated : Mar 19, 2021, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details