స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ మీద ఉన్నాయి. రోజుకో జీవితకాల రికార్డును నమోదు చేస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూలతలకు తోడు ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి షేర్లు రాణించడం మార్కెట్ల జోరుకు కారణమైంది.
సోమవారం సెషన్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్... 617 పాయింట్లు లాభపడింది. ఓ దశలో 51,523 పాయింట్లతో సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరిన సూచీ.. చివరకు 51,349 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం భారీ లాభాల్లో కొనసాగింది. ట్రేడింగ్లో 15,160 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 192 పాయింట్ల లాభంతో.. 15,116 వద్ద ముగిసింది. నిఫ్టీకి సైతం ఇదే ఆల్టైమ్ రికార్డు ముగింపు.
లాభనష్టాల్లోనివివే
సెన్సెక్స్ షేర్లలో మహీంద్ర అండ్ మహీంద్ర 7 శాతానికిపైగా వృద్ధి చెందింది. ఐటీసీ, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫైనాన్స్ మినహా అన్ని షేర్లు లాభాల్లోనే పయనించాయి.