తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Markets: జీవనకాల గరిష్ఠాలకు సూచీలు

స్టాక్ మార్కెట్లు వారంతపు సెషన్​ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్​ 174 పాయింట్లు పెరిగి 52,474 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు పుంజుకుని 15,799 కు చేరుకుంది.

bse
బీఎస్​ఊ

By

Published : Jun 11, 2021, 3:45 PM IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 174 పాయింట్లు బలపడి 52,474 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 15,799 వద్ద ముగిసింది. ప్రధానంగా ఐటీ, ఇతర బడా సంస్థల షేర్లు లాభాలను గడించాయి.

కరోనా రెండో దశ అదుపులోకి రావడం, అంతర్జాతీయ మార్కెట్లు నుంచి సానుకూల స్పందన ఉండడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీనికి తోడు అంతర్జాతీయ సానుకూల పవనాలతో సూచీలు లాభాల బాట పట్టాయి. ఈ క్రమంలో జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,641 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,388 పాయింట్ల అత్యల్ప స్థాయులను నమోదు చేసింది.

నిఫ్టీ 15,853 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,749 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభ నష్టాల్లోనివి ఇవే..

  • డాక్టర్​ రెడ్డీస్​, పవర్​గ్రిడ్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్ టెక్​,రిలయన్స్​, టెక్​ మహీంద్ర, సన్​ఫార్మా షేర్లు లాభాలను గడించాయి.
  • ఎల్​ అండ్​ టీ, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఆల్ట్రాటెక్​ సిమెంట్​, ఐసీఐసీఐ బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టపోయాయి.

ABOUT THE AUTHOR

...view details