స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్థిక వృద్ధి మరింత తగ్గుతుందన్న ఆర్బీఐ అంచనాల నేపథ్యంలో మదుపరులు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ - సెన్సెక్స్ 150 పాయింట్లు కోల్పోయింది. 39 వేల 375 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ- నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 11 వేల 795 వద్ద కొనసాగుతోంది.