వారం ప్రారంభంలో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. మంగళవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 38,901 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 83 పాయింట్లు మెరుగై 11,470 పాయింట్లకు చేరుకుంది.
ఏజీఆర్ బకాయిలకు సంబంధించి టెలికాం సంస్థలకు పదేళ్ల గడువు ఇస్తూ సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో టెలికాం షేర్లు 4 శాతం వృద్ధి సాధించాయి.